NRPT: మక్తల్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి వెంబడి చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. ముఖ్యంగా కోళ్ల వ్యర్థాల వల్ల తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుధ్య పనులు చేపట్టి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.