విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర సీఐటీయూ మహాసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కేంద్రం అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని, కార్మికులపై లేబర్ కోడ్స్ ప్రయోగిస్తోందని మండిపడ్డారు.