NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో చేపట్టనున్న బస్తీ దవాఖాన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, పలువురు కౌన్సిలర్లు ఆదివారం బస్తీ దవాఖానకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాసులు, పడకండి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.