W.G: ఇటీవల తెలుగుదేశం పార్టీలో రీజనల్ కో- ఆర్డినేటర్‌గా నియమితులైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు ఆదివారం పలు సంఘాలు అభినందనలు తెలిపాయి. శాలివాహన కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాధాకృష్ణను కూటమి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చంతో శాలువాతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గురుజుకోట రాకేష్ బాబు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.