TPT: సూళ్లూరుపేట(M) కోటపోలూరు వెస్ట్ హరిజనవాడలో నీటి ట్యాంక్ నుంచి తాగునీరు భారీగా వృథా అవుతోంది. రాత్రి నుంచి పైప్లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.