SS: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గ్రామీణ రహదారుల సమస్యలను పరిష్కరిస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. గోరంట్ల మండలం కొండాపురం గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఆదివారం మంత్రి ప్రారంభించారు. దాదాపు 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి పూర్తవడంతో గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.