W.G: పాలకోడేరు గ్రామ పరిధిలోని గొల్లలకోడేరు వంతెన నుంచి వేండ్ర రైల్వే గేట్ వరకు ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు ఆదివారం తొలగించారు. రహదారికి ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. వ్యాపారులు స్వచ్ఛందంగా స్పందించకపోవడంతో, అధికారులు రంగంలోకి దిగారు.