KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురంలో ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు ఆదివారం టీడీపీ నాయకులు బీపీ ఈరన్న, రాజశేఖర్ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల వెంబడి డ్రైనేజీల పూడిక తీత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బీపీ ఈరన్న మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.