SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు. అభిషేకం, అన్న పూజ, కళ్యాణం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.