PPM: సీతానగరం మండలం మరిపివలసలో కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఎస్‌హెచ్‌జి మహిళలతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన నమోదు ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించి స్వీయగణన చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని, ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు.