SRPT: మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట మండలం బాలెంలలో మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఛైర్మన్ సంధ్యరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు.