కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల కోసం ఆదోని 2టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదివారం రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో సత్ప్రవర్తనతో జీవించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.