KDP: జాతీయస్థాయి క్రీడల్లో పులివెందులకు చెందిన అమర్జీవ్ రెడ్డి కుమారుడు అరుష్ రెడ్డి సత్తా చాటాడు. ఈనెల 16వ తేదీ నుంచి 22 వరకు ఢిల్లీలో STFI ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 టెన్నిస్ బాలుర విభాగంలో ప్రతిభ చూపి జాతీయ 69వ పాఠశాల క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. దీనిపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.