ATP: రాయదుర్గం నియోజకవర్గం వద్దనూరు అప్పలాపురం ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం 22 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు.