MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనంలో కలుసుకున్నారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు చెన్న కిష్టారెడ్డి, శివన్న, మనోహర్ రావు, వనజమ్మలను పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. చిన్నప్పుడు జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకున్నారు.