SRD: నైబర్ హుడ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు.