చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ ఆయూష్ మాత్రే నిన్న SRHతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. తాజాగా అతడి గాయంపై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు. మాత్రే గాయం తీవ్రత ఎక్కువగా ఉందని అతడు స్పష్టం చేశాడు. దీంతో ఆయూష్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. కీలక సమయంలో ఇది CSK జట్టుకు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.