KDP: ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను సీఐ నగేష్ బాబు పోలీస్ స్టేషన్కు ఆదివారం పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనరాదని హెచ్చరించారు.