టాలీవుడ్లో ‘రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్’ వివాదం ముదురుతోంది. మల్టీప్లెక్స్ తరహాలో సింగిల్ స్క్రీన్లలోనూ పర్సెంటేజీ విధానం కోరుతూ ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కు సిద్ధమవుతున్నారు. ఇది సమ్మర్ బిగ్ రిలీజ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. థియేటర్లు మూతపడితే కలెక్షన్స్, ప్రీ-రిలీజ్ బిజినెస్ దెబ్బతింటాయి. రాజీ పడకపోతే ఈ వేసవి సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలమే.