KMR: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నూతన మీ సేవా కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, 21-44 ఏళ్ల వయస్సు వారు అర్హులన్నారు. లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన వారు పోలీస్ క్లియరెన్స్ పొందాలని, ఆసక్తి గలవారు నేడు సాయంత్రంలోపు అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.