NLG: గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎడ్ల మహాలింగం యాదవ్, చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఆయన యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా, ఓబీసీ బ్లాక్, టౌన్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఆయన సతీమణి పద్మ గతంలో స్కూల్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు.