AP: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కందుల దుర్గేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరిట రికార్డు రావటంపై ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవలను మంత్రి కొనియాడారు. చిరంజీవి ఈ అవార్డు అందుకోవటం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.