TG: మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘MLAలు కడియం శ్రీహరి, అరెకపూడి గాంధీ CLP భేటీకి హాజరైతే మర్యాదపూర్వక కలయిక అంటున్నారు. ఇక్కడ శ్రీధర్ బాబు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. నియోజకవర్గంలో CM కార్యక్రమం ఉంటే కలవచ్చు కానీ, CLP సమావేశానికి వస్తే కలవకూడదు కదా. ఓ పార్టీ MLA మరో పార్టీ LP భేటీకి ఎలా హజరవుతారు. మంత్రి వైఖరి పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుంది’ అని మండిపడ్డారు.