AP: ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పించుకోలేరంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని తాను ఎప్పుడో సీఎం చంద్రబాబుకి లేఖ రాశానని తెలిపారు. తాను జనసేనలో చేరుతుండటం నచ్చకే జనార్దన్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు.