ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని అన్నారు.