KMR: బాన్సువాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. “ఇప్పట్లో నిధులు ఇవ్వలేం” అని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరుపై పోచారం అసహనం, పార్టీ హైకమాండ్ స్పందన చూస్తుంటే బాన్సువాడ రాజకీయం ఉత్కంఠ నెలకొంది.