NZB: దళారులకు వడ్లు అమ్మి రైతులు మోసపోవద్దని డీసీసీ ఉపాధ్యక్షులు చిన్న బాలరాజ్ సూచించారు. మంగళవారం గోవిందపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, బి గ్రేడ్‌కు రూ.2,369 మద్దతు ధర ఇస్తోందని, రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.