MDK: ప్రమాదం వల్ల చేతివేళ్లు విరిగినా, అధైర్యపడకుండా ఇంటర్ పరీక్షలు రాసిన హర్షిత ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హర్షిత చేతులు గాయపడినా కలెక్టర్ అనుమతితో మరో విద్యార్థి సహాయంతో పరీక్షలకు హాజరైంది. తన పట్టుదలతో 500 మార్కులకు గాను 468 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.