WGL: వర్ధన్నపేటలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, ప్రజా ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను స్థాపించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చిరస్మరణీయమని అన్నారు.