AP: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 ఏఈ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. మే 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 39,121 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, చెన్నై ఐఐటీ మరియు ఏపీ ఆన్లైన్ ఏజెన్సీల ద్వారా ఈ పరీక్షలను టీటీడీ యంత్రాంగం నిర్వహించనుంది.