KRNL: ఐదేళ్లలో హంద్రీనీవాకు వైసీపీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘మీ కడుపు మంటకు మందులు పంపిస్తాం.. వాడుకోండి. బొత్స చెప్పిన మాటలను అచ్చెన్న గుర్తు చేశారు. మీరు చెప్పిన మాటలను గుర్తు చేస్తే ఉలుకెందుకు?. భయంలో నుంచి బొత్సకు బాధ పుట్టుకొచ్చిందేమో?. జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారని అన్నారు.