»Horoscope Today Todays Horoscope 2024 July 25th Ishtadevata Naamsmarana Is Auspicious
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 25th)..కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
ఈ రోజు(2024 July 25th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మొదలు పెట్టిన పనుల విషయంలో విజయాన్ని పొందుతారు. అనుకోని ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
వృషభం
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను, సన్నిహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది.
మిథునం
మంచి పనుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలు ఉన్నాయి.
కర్కాటకం
ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బంధు, మిత్రులను, సన్నిహితులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఇంటి పనులపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కన్య
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సమాజంలో మంచిపేరు వస్తుంది. బంధు, మిత్రులను కలుస్తారు.
తుల
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృశ్చికం
మిక్కిలి ధైర్య సాహసాలతో ముందుకు వెళుతారు. సూక్ష్మబుద్ధిని కలిగి ఉంటారు. మీ ధైర్యసాహాసాలను ఇతరులు గుర్తిస్తారు. శత్రువుల బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి. అశుభవార్తలు వింటారు. ఆకస్మిక ధననష్టం కలుగుతుంది. ఈ రోజు కాస్త మనస్తాపానికి గురవుతారు.
మకరం
కుటుంబ కలహాలు ఉండవు. మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండాలి.
కుంభం
కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. స్త్రీల మూలకంగా లాభం. పేరు, ప్రతిష్ఠలు మెరుగవుతుంది.
మీనం
తోటివారితో జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం ఎక్కువ. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.