KKD: కిర్లంపూడి మండలం జగపతినగరంలో ఉపాధి హామీ కూలీలకు స్థానిక ఎస్సై జి. సతీష్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.