GNTR: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన సీ.ఎం.సాయికాంత్ వర్మను శనివారం కలెక్టరేట్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించారు.