AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి నేతలు వైసీపీ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘పార్లమెంట్లో అమరావతిపై పెట్టిన శ్రద్ధ.. ప్రత్యేక హోదాపై ఎందుకు చేయలేదు? మావిగన్‌లో తప్పేముంది? జగన్ అమరావతిని ఆపేయమని ఎక్కడా అనలేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబు అమరావతిని ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.