VKB: తాండూరులో అత్యంత వైభవంగా జరిగే శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని జాతర కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా ఉత్సవాలకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జాతర నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.