ASR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే రాజీనామా చేయించాలని అరకు MLA రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అరకులోయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగలక్ష్మీ, వైసీపీ శ్రేణులతో పూజలు చేశారు. తిరుమల పవిత్రతను పాడుచేస్తున్న బీఆర్ నాయుడు గురించి వైసీపీ చెబుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.