PLD: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా అమరావతి మండలం వైకుంఠపురంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.