TG: ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటింగ్‌కు చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం జరిగింది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు గొడవకు దిగారు. మొత్తం 12 వార్డులకు గానూ బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు. దీంతో మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.