ఏలూరు పట్టణ పరిధిలో ఉన్న వివిధ దుకాణాలలో ఇవాళ పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. స్కూల్లు, కాలేజీల వద్ద పొగాకు ఉత్పత్తులు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు హెచ్చరించారు.