ఆదిలాబాద్ మండలం ఛిద్దరి ఖానాపూర్ ఆశ్రమ పాఠశాలను ప్రత్యేక అధికారి చౌహన్ గోరఖ్ నాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులను పరిశీలించి, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, నాణ్యమైన విద్యను బోధించాలని ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు.