NRPT: మద్దూరు పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 6 చివరి తేదీగా నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.