మాజీ సీఎం పళనిస్వామి వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణానిధిని అన్నాడీఎంకే చాలాసార్లు అవమానించిందని ఆరోపించారు. కరుణానిధి సమాధికి పళనిస్వామి భూమి ఇవ్వలేదన్నారు. తమ కుటుంబం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పళనిస్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.