అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.1 ఓవర్లలో ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ(90) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నిస్సంక(44), మిల్లర్(21) రాణించారు. ముంబై బౌలర్లలో చాహర్, సాంట్నర్, బాష్ తలో వికెట్ తీశారు.