NLG: దేవరకొండ కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు శనివారం సందర్శించారు. వేసవికాలం సందర్బంగా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంత పరిధిలో కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి న్యాయవాదుల కృషిని కొనియాడారు.