AP: అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ పేరుతో జరిగే అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. ‘అమరావతి మాకు శాసన రాజధాని మాత్రమే. అమరావతి కోసం మేమెందుకు రూ.లక్షా పదివేల కోట్లు ఖర్చు చేస్తాం? అక్కడ పనులను వేగంగా పూర్తి చేయాలి. చంద్రబాబు అమరావతిని జాప్యం చేస్తే మేం ఇంకో ఆలోచన చేస్తాం’ అని బొత్స వెల్లడించారు.