NLG: చిట్యాల పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వెంటనే మరో లైన్మెన్ను నియమించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇద్దరు లైన్మెన్లు ఉండాల్సి ఉండగా, ఒకరు రిటైర్ కావడంతో ఆరు నెలలుగా పోస్టు ఖాళీగా ఉందని, ఒక్కరితోనే పనులు సాగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నియామకం చేపట్టాలని బీజేపీ నేత అశోక్ విజ్ఞప్తి చేశారు.