AP: కుట్రలో భాగంగానే జగన్ ‘మావిగన్’ పేరును తీసుకొచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ’12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ మళ్లీ ప్రాంతాలు, కులాలు మధ్య చిచ్చు పెట్టాలి అనుకుంటున్నారు. మూడు రాజధానుల పేరుతో నాటకమాడారు. మూడు రాజధానులని ఏం ఉద్ధరించారో చెప్పాలి? ఉత్తరాంధ్రకు రాజధాని అన్నారు.. ఏం చేశారో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.