BHNG: బీబీనగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోకదాస్ ఉప్పలయ్య ఆ పార్టీని వీడి BRS పార్టీలో చేరారు. శనివారం BRS మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, రైతు బంధు సమితి మండల మాజీ కో ఆర్డినేటర్ జయపాల్ రెడ్డి, BRS నాయకుడు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.