VZM: రాష్ట్రంలో భూగర్భ, ఉపరితల జల మట్టాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే పేరుతో 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం ఏప్రిల్ 6, 2026 నుంచి జూలై 14, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు కానుందన్నారు.